US Man Arrested After Allegedly Trying To Open An Emergency Exit Door - Sakshi
Sakshi News home page

విమానం ల్యాండింగ్‌ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచే యత్నం..

Mar 7 2023 8:19 AM | Updated on Mar 7 2023 9:16 AM

US Man Arrested Allegedly Trying To Open Flight Emergency Door - Sakshi

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ని ఓపెన్‌ చేసేందుకు యత్నించిన 33 ఏళ్ల వ్యక్తి అరెస్టు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై..

మసాచుసెట్స్‌లోని లియోమిన్‌స్టర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్‌ ఏంజిల్స్‌ నుచి బోస్టన్‌కు యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్‌ తీసేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని బోస్టన్‌లో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టోర్రెస్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. టోర్రెస్‌ లాస్‌ఏంజిల్స్‌ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా..విమానం ల్యాండింగ్‌ అవ్వడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్‌ అన్‌లాక్‌ చేసి కొంచెం దూరం వరకు ఓపెన్‌ చేశాడు.

దీంతో సరిగ్గా అదే సమయంలో విమాన సిబ్బందికి కాక్‌పిట్‌లో అలారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానం తనిఖీ చేయడం ప్రారంభించారు. వారంతా విచారిస్తుండగా..ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ విభాగాల మధ్య ఉన్న స్టార్‌బోర్డ్‌ సైడ్‌ డోర్‌ అన్‌లాక్‌ అయ్యి కొద్ది దూరం జరిగినట్లు ఉంది. దీంతో వారు ఆ డోర్‌ని లాక్‌చేసి వచ్చి ఈ విషయాన్ని పైలెట్‌కి తెలిపారు. ఫ్లైట్‌ సిబ్బంది మేము ఆ డోర్‌ వద్ద టోర్రెస్‌ అనే వ్యక్తి ఉండటం గమనించామని చెప్పారు.

అతను తాను చేసిన విషయాన్ని మరోకరికి చెప్పడం కూడా చూశామని చెప్పడంతో వారు టెర్రెస్‌ని ఈ విషయమై కొంచెం గట్టిగా అడిగారు. అంతే అతను కోపంతో విమానా సహాయకురాలిని మెటల్‌ చెంచాతో మెడపై మూడు సార్లు పొడిచాడు. దీంతో ప్రయాణికులు టోర్రెస్‌ని విమాన సిబ్బంది సాయంతో అడ్డుకుని అదుపుచేసి.. బోస్టన్‌లో విమానం దిగిన వెంటనే భద్రతా బలగాలు అతన్ని అప్పగించారు. ‍ప్రమాదకరమైన ఆయుధంతో సిబ్బంది, ఫ్లైట్‌ అటెండెంట్‌పై దాడి చేసేందుకు యత్నించినందుకు అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 2 లక్షలు పైనే జరిమాన విధించే అవకాశం ఉందని సదరు ఎయిర్‌లైన్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. 

(చదవండి: సెల్‌ఫోన్లకు ఫ్రీ బీర్లు ఆఫర్‌.. ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement