
ముంబై: నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్ చేసుకుంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త విపిన్ భాటి, అత్తమామలు నిక్కీభాటిని సజీవ దహనం చేశారు. ఇప్పుడే అదే నిక్కీభాటి కుటుంబ సభ్యులు వరకట్నం కావాలని తననూ వేదించినట్లు నిక్కీభాటి వదిన మీనాక్షి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నిక్కీభాటి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
నోయిడా వరకట్న హత్య కేసులో బాధితురాలు నిక్కీ భాటి కుటుంబంపై వదిన మీనాక్షి ఆరోపణలు చేశారు. నిక్కీభాటి సోదరుడు రోహిత్ పయ్లాతో మీనాక్షి వివాహం జరిగింది. వరకట్నం కావాలని తన మాజీ భర్త రోహిత్‌తో పాటు అతని తల్లిదండ్రులు తనని వేధించారని అన్నారు. దీంతో తన కుమార్తె ప్రాణం తీసిన విపిన్ భాటి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాంటూ నిక్కీభాటి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న తరుణంలో వారిపై ఆరోపణలు రావడంతో కేసును చేధించడం పోలీసులకు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
రోహిత్,మీనాక్షీలకు 2016లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద మీనాక్షి కుటుంబ సభ్యులు కట్నం కింద మారుతి సియాజ్‌ను ఇచ్చారు. ఆ తర్వాత అశుభం పేరుతో దాన్ని అమ్మేశారు. బుదులు స్కార్పియో ఎస్‌యూవీ కొత్తమోడల్ కట్నం కింద డిమాండ్ చేశారు.
అందుకు తాను, తన కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పంపించారు. ఇదే విషయాన్ని పెద్దల సమక్షంలో తేల్చుకోనేందుకు గ్రామ పంచాయితీకి తీసుకెళ్లారు. అక్కడ మినాక్షి కుటుంబానికి రూ.35 లక్షలు (వారి వివాహానికి ఖర్చు చేసిన మొత్తం) తిరిగి ఇవ్వాలని, తద్వారా ఆమె తిరిగి వివాహం చేసుకోవచ్చని లేదా భర్త కుటుంబం ఆమెను తిరిగి తమ కోడలుగా అంగీకరించాలని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆమెను తిరిగి కోడలుగా స్వీకరించేందుకు నిక్కీ భాటియా తండ్రి భిఖారి సింగ్ పైలా, ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం నోచుకోలేదని మీనాక్షి వాపోయారు.
మీనాక్షి ఆరోపణలపై ఆమె మాజీ భర్త నిక్కీ భాటి సోదరుడు మాట్లాడేందుకు నిరాకరించాడు. నేను ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదు.ఆమె కేవలం ఆరోపణలే చేసిందన్నారు. ఇదే విషయంపై నిక్కీ భాటి మరో కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కాల్పులకు దారి తీసింది. ప్రతీ ఇంట్లో గొడవలు జరగడం సాధారణం. కానీ మేం ఆ అమ్మాయిని తగలబెట్టలేదు’ అని రోహిత్ కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు.