
1. రష్యా సైనికుల పైశాచికం.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న పైశాచిక దాడిలో వేలాది మంది సైనికులు, పౌరులు, బలవుతున్నారు. వీరిలో అమాయక మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీవ్ నగరంలో రష్యా బలగాలు కాల్చి చంపిన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2..వీడియో: కులం పేరిట వేధించారు.. నవనీత్‌కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్
ఎంపీ నవనీత్‌కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు హనుమాన్ చాలీసా వివాదంతో మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి ముంబైలోని ఖర్ పోలీస్టేషన్‌కు సైతం తరలించారు. అయితే పోలీసుల తీరుపై ఆమె సంచలన ఆరోపణలకు దిగారు.
3..కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే: ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. పార్టీలో చేరి బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అందించిన ఆఫర్‌ను పీకే తిరస్కరించారు. ఈ మేరకు పీకే ట్విటర్‌లో స్పందించారు.
4.. ప్రశాంత్ కిషోర్ సేవలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారని, తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదన్నారు.. భవిష్యత్‌లో కూడా పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చన్నారు.
5.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు.
6.. Richa Gangopadhyay : 'మిర్చి' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించింది. తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమ పెళ్లి చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రీచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది.
7.. IPL Auction: నమ్మకద్రోహం చేశారు.. మోసపోయాను.. కానీ: హర్షల్ పటేల్
హర్షల్ పటేల్.. ఐపీఎల్-2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. హర్షల్ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు.
8.. ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన
శంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండడం, బ్యాటరీలు పేలిపోతుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగుపెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు.
9.. Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే
ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు.
10.. కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాపం చేసింది కట్టుకున్న వాడైనా సహించేది లేదని జరిగిన దారుణాన్ని లోకానికి తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ కన్నతల్లి.