అప్పటిదాకా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు 

Tax exemptions for startups Union Budget 2023-24 - Sakshi

న్యూఢిల్లీ: అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్‌ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్‌ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం.

2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది.

‘కొత్త కోపరేటివ్‌లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్‌లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్‌ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్‌ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు.   

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top