తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు

Tamilnadu Assembly Election Results 2021: Live Updates In Telugu - Sakshi

ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

కరోనా ఆంక్షల నడుమ లెక్కింపు 

అన్నాడీఎంకే–డీఎంకేల్లో గెలుపు ధీమా 

తుది ఫలితాలకు అర్ధరాత్రి దాటే అవకాశం 

Live Updates:  
►ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి గెలుపొందారు.
►చెపాక్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమార్‌, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్‌ విజయం సాధించారు.

►తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో డీఎంకే దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన స్థానాలు దాటేసి, స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయం చేజిక్కుంచుకునే దిశగా సాగుతోంది. దీంతో డీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నాయి. తమిళనాడు కాబోయే సీఎం తమ అధినేత స్టాలిన్‌ అంటూ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సర్వేల అంచనాలు నిజం చేస్తూ డీఎంకే గెలుపు దిశగా పయనిస్తున్న వేళ స్టాలిన్‌ సోదరి కనిమొళి ఆయన నివాసానికి చేరుకున్నారు.

 

Time 11:30 AM
 
ఆధిక్యం: డీఎంకే- 138, అన్నాడీఎంకే- 95, ఇతరులు-1        
Time 11:00 AM
 ఆధిక్యం: డీఎంకే- 133, అన్నాడీఎంకే- 100, ఇతరులు-1

Time 10:50 AM 
బోడినాయక్కనూరులో పన్నీర్ సెల్వం వెనుకంజలో ఉన్నారు. 

Time 10:40 AM
► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌(117)కు కావాల్సిన స్థానాలను దాటేసి ముందంజలో నిలిచింది. ఇక తమిళనాడులో డీఎంకేదే అధికారం అంటూ సర్వేలన్నీ ఆ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలన్నీ నిజమయ్యేలా స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.  
 ► ఆధిక్యం: డీఎంకే- 145, అన్నాడీఎంకే- 74, ఇతరులు-2

Time 10:30 AM
 ► ఆధిక్యం: డీఎంకే-128, అన్నాడీఎంకే- 61, ఇతరులు-2

Time 10:15 AM
►విరుదాచలంలో విజయ్‌కాంత్‌ భార్య ప్రేమలత వెనుకంజలో ఉన్నారు. కొలత్తూర్‌లో స్టాలిన్‌ ముందంజలో ఉన్నారు. 

►ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చెపాక్‌ అసెంబ్లీ స్థానంలో పోటీచేసిన డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్‌ క్వీన్స్‌ మేరీ కాలేజీకి వచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి కౌంటింగ్‌ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం ఆయన ముందంజలో కొనసాగుతున్నారు.

TIME 9: 55 AM
ఆధిక్యండీఎంకే- 125, అన్నాడీఎంకే- 90

TIME 9: 40 AM
►ముందజంలో డీఎంకే- 112, అన్నాడీఎంకే- 82
►థౌజండ్‌లైట్స్‌లో ఖుష్బూ వెనుకంజ

►కొలత్తూర్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన డీఎంకే అధినేత స్టాలిన్‌ ముందంజలో ఉన్నారు.
►కోయంబత్తూర్‌ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్‌ ఆధిక్యం కనబరుస్తున్నారు.
►ఎడప్పాడి నుంచి పోటీ చేసిన సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్‌ నుంచి బరిలో దిగిన డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ముందంజలో ఉన్నారు. 
►కోవిల్‌పట్టిలో వెనుకంజలో దినకరన్‌

►డీఎంకే అభ్యర్థులు పలుచోట్ల ముందంజలో ఉన్నారు.
►డీఎంకే ఆధిక్యం-107, అన్నాడీఎంకే- 70

►డీఎంకే ఆధిక్యం-93. అన్నాడీఎంకే-63
►65 స్థానాల్లో డీఎంకే ముందంజ.. 42 చోట్ల అన్నాడీఎంకే ఆధిక్యం
►డీఎంకే 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార అన్నాడీఎంకే 8 చోట్ల ఆధిక్యంలో ఉంది.
►శాసన సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 234 స్థానాలకు గానూ డీఎంకే 3 చోట్ల ఆధిక్యంలో ఉంది.

అసెంబ్లీ స్థానాలు  -  234 
పోటీలో ఉన్న అభ్యర్థులు  -  3,998 
మొత్తం ఓటర్లు  -  6.28 కోట్లు 
పోలింగ్‌ శాతం  -  72.81 శాతం 
లెక్కింపు కేంద్రాలు  -  75 
కౌంటింగ్‌ సిబ్బంది  -  16 వేలు 
బందోబస్తు ఉన్న పోలీసులు  -  లక్ష 

ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాలు:
ఎడప్పాడి నుంచి బరిలో నిలిచిన సీఎం పళనిస్వామి
బోడినాయక్కనూర్‌లో పోటీ చేసిన పన్నీర్‌ సెల్వం
కొలత్తూర్‌ నుంచి రంగంలోకి దిగిన డీఎంకే అధినేత స్టాలిన్‌
చెపాక్‌లో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్‌(డీఎంకే)
కోవిల్‌పట్టి బరిలో శశికళ అల్లుడు టీటీవీ దినకరన్‌
కోయంబత్తూర్‌ దక్షిణ నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్‌
థౌజండ్‌ లైట్స్‌ నుంచి రంగంలోకి దిగిన నటి ఖుష్బూ
►2016లో 136 సీట్లతో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే
►2016లో 89 సీట్లు మాత్రమే దక్కించుకున్న డీఎంకే

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏప్రిల్‌ 6న రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

అన్నాడీఎంకే–డీఎంకే మధ్యే ప్రధాన పోటీ 
ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేశాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వీటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని  కూటమి నుంచి విజయకాంత్‌ అధ్యక్షుడిగా ఉన్న డీఎండీకే పోటీకి దిగింది. నామ్‌ తమిళర్‌ కట్చి అధినేత సీమాన్‌ నేతృత్వంలో మరో కూటమి బరిలోకి దిగింది.

రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొన్నా అధికార పీఠం మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేలో ఏదో ఒక పార్టీకి దక్కే అవకాశం ఉంది. హోరాహోరీ ప్రచారాల అనంతరం ఏప్రిల్‌ 6న 72.81 శాతంతో పోలింగ్‌ ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల లెక్కింపునకు 25 రోజులు వేచి ఉండక తప్పలేదు.  వరుసగా మూడోసారి గెలుపొంది అన్నాడీఎంకే చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అగ్రనేతలు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేసిన కమల్‌హాసన్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో కోవైకు రానున్నారు.  

ఆంక్షలు, బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు 
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 16 వేల మందిని ఎంపిక చేసి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేంద్రాల వద్ద థర్మల్‌స్క్రీనింగ్‌ చేసే లోనికి అనుమతించనున్నారు. ముందుగా తపాలా ఓట్ల లెక్కింపు చేస్తారు. అనంతరం 75 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 3,372 టేబుళ్ల ద్వారా ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద లక్ష మంది పోలీసులతో బందోబస్తు పెట్టినట్లు డీజీపీ త్రిపాఠి తెలిపారు. వీరిలో 50 వేల మంది పారామిలిటరీ దళాలు, సాయుధ పోలీసులు ఉంటారని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ముమ్మర తనిఖీలు  
తిరువళ్లూరు: జిల్లాలోని 10 నియోజకవర్గాలకు ఆదివరం కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి సుమారు ఐదు కి.మీ పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు వచ్చే అన్నీ మార్గాలను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా మినీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కౌటింగ్‌ను పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు.  సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచుతామని కలెక్టర్‌ తెలిపారు. తిరువళ్లూరులో 23 రౌండ్‌లు, తిరుత్తణి 29, గుమ్మిడిపూండీ 29, మాధవరం 31, పొన్నేరి 27 , తిరువొత్తియూర్‌ 31, పూందమల్లి 36, అంబత్తూరు 39, ఆవడి 31, మాధవరం 31 రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఏర్పాట్లు పూర్తి
వేలూరు: జిల్లాలోని ఐదు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలూరు, అనకట్టు నియోజక వర్గాలకు వేలూరు తందై పెరియార్‌ కళాశాలలో, కాట్పాడి నియోజకవర్గం కాట్పాడి న్యాయ కళాశాలలో, గుడియాత్తం, కేవీ కుప్పం నియోజకవర్గాలకు గుడియాత్తం రాజగోపాల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరగనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top