
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ రాష్ట్ర శాఖ వేసిన పరువునష్టం కేసును డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య
రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలన్న సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం
పిటిషన్‌ను కొట్టేసినా వాదించే ప్రయత్నం చేసిన బీజేపీ తరఫు న్యాయవాది
మండిపడ్డ సీజేఐ.. మళ్లీ ఇలాంటి పిటిషన్ వేస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్‌చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజకీయ యుద్ధాలకు ఈ కోర్టును ఉపయోగించుకోవద్దని పదేపదే చెబుతున్నాం’అంటూ సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోదలచుకోలేదని తేల్చిచెప్పారు.
రాజ కీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తట్టుకొనే శక్తి ఉండాలని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. అయినా రంజిత్ కుమార్ వాదనలు కొనసాగించేందుకు ప్రయతి్నంచడంతో సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మేం ఇప్పటికే పిటిషన్‌ను కొట్టేశాం. ఇంకా వాదనలు దేనికి? మళ్లీ ఇలాంటి పిటిషన్‌తో కోర్టుకు వస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తాం’అంటూ హెచ్చరించారు.
ఇదీ నేపథ్యం..
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పార్టీకి రాజకీయంగా పరువునష్టం కలిగించాయంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ట్రయల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి ఐపీసీ సెక్షన్ 499, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద విచారణకు ఆదేశించింది.
ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండి ఉంటాయి. వాటిని పరువునష్టంగా పరిగణించడం సరికాదు’అని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ రేవంత్‌కు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిõÙక్ మను సింఘ్వీ, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.