ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు | Strong Earthquake Tremors Felt in Delhi | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు

Jul 10 2025 9:26 AM | Updated on Jul 10 2025 12:09 PM

Strong Earthquake Tremors Felt in Delhi

న్యూఢిల్లీ: దేశారాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని క్షణాలపాటు బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.1  తీవ్రత నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో భూకంప తీవ్రత కనిపించింది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపాన్ని గుర్తించినంతనే జనం భయాందోళనలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే జనం రోజువారీ కార్యకలాపాల్లో మునిగివున్న సమమంలో ఈ భూకంపం సంభవించింది.

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి  భూకంపం సమయంలో తన అనుభవాన్ని వివరిస్తూ, అప్పుడే తాను నిద్రలేచానని, భూ ప్రకంపనలు చూసి భయపడ్డానని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇలానే భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

 


ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. జనం భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది.

జజ్జర్‌లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు  మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌)తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం జజ్జర్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement