వైభవంగా శ్రీ గణపతి సచ్చిదానంద సహస్ర చంద్రదర్శన వేడుకలు | shri Ganpati Sachidanand Swami Shanti Mahotsav Celebrations | Sakshi
Sakshi News home page

article header script

వైభవంగా శ్రీ గణపతి సచ్చిదానంద సహస్ర చంద్రదర్శన వేడుకలు

Published Sun, Feb 5 2023 11:10 AM | Last Updated on Sun, Feb 5 2023 11:44 AM

shri Ganpati Sachidanand Swami Shanti Mahotsav Celebrations - Sakshi

మైసూరు :అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ  వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.  దేశం నలుమూలల నుండి అనేక మంది చతుర్వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్య స్వామీజీ వారు విశేషంగా భక్తులకు తమ  అనుగ్రహ  సందేశం అందించారు. గత 50 సంవత్సరాల నుండి పూజ్య స్వామీజీ జన్మదినోత్సవ వేడుకలలో వివిధ శాఖలకు చెందిన వేదపండితులు, అర్చకులను గౌరవించే ఆనవాయితీ క్రమంలో నేడు అనేక మంది చతుర్వేద పండితులను, ఆలయ అర్చకులను  గౌరవించారు. 

వేదవిద్యను అందరూ  ప్రోత్సహించాలని అన్నారు. ఆలయ అర్చకులను అందరూ గౌరవించాలి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు. అర్చకులను గౌరవించక పోతే ధర్మం క్షీణిస్తుంది, అర్చకులను పోషిస్తే దేశం సుభిక్షాంగా ఉంటుంది అన్నారు.  ఆలయాలను రక్షించడంలో అర్చకులు పోషిస్తున్న  ప్రధానపాత్రను కొనియాడారు. భారతీయులమైన మనం అర్చకులను తప్పనిసరిగా ప్రోత్సహించి వారికి కావలసిన వసతులు కల్పించటం మన బాధ్యతగా అందరూ ఆచరించాలి అని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement