భారత్‌కు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమాసియా యుద్ధ తీవ్రత దృష్ట్యా చమురు సంక్షోభం నేపథ్యంలో తాను అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చింది. ఈ మేరకు ముడి చమురు సరఫరా పెంపుకు ఆ దేశ ఉప ప్రధాని భారత్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.
చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. భారత్‌తో సహా ఎన్నో దేశాలు ఈ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత పర్యటనలో ఉన్న రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారతవిదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ సలహాదారు అజిత్ ధోబల్‌తో ఇంధన అంశమై రష్యా ఉపప్రధాని భేటీ జరిగినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో భారత్‌కు కావాల్సిన ముడి చమురు,లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG),సరఫరాను మరింత పెంచుతామని ఆయన హామీ ఇచినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆయన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే కేవలం చమురు మాత్రమే కాకుండా.. అణుశక్తి , సాంకేతికత, మరియు కీలక ఖనిజాల రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి.


