సీఈసీ అభిశంసన తిరస్కరణ | Rejection of CEC Impeachment | Sakshi
Sakshi News home page

సీఈసీ అభిశంసన తిరస్కరణ

Apr 6 2026 10:21 PM | Updated on Apr 6 2026 10:21 PM

Rejection of CEC Impeachment

ఢిల్లీ: ఎన్నికల ప్రధానాధికారి  జ్ఞానేశ్వర్ కుమార్‌పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం తిరస్కరణకు గురైంది.తీర్మానంలోని అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించిన రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు. మరోవైపు లోక్‌సభలోనూ ఈ నోటీసు తిరస్కరణకు గురైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనిని తిరస్కరించారు.

సీఈసీ జ్ఞానేశ్వర్ అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయనపై విపక్షాలు మెుత్తంగా ఏడు  అభియోగాలు మోపాయి. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి పక్షాలు ఉభయ సభల్లో నోటీసులు సమర్పించాయి. దీనిపై 63 మంది రాజ్యసభ ఎంపీలు, 130 మంది లోక్‌సభ ఎంపీలు సంతకం చేశారు. తాజాగా తీర్మానాన్ని రాజ్యసభ స్పీకర్ తిరస్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement