10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు

Record Liquor Business In Bengaluru Compared To Last Few Years - Sakshi

సాక్షి, శివాజీనగర: ఐటీ సిటీలో కొత్త సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారింది. కొత్త వేడుకల సమయంలో గత రెండేళ్లుగా కరోనా వల్ల మద్యం వ్యాపారం పూర్తిగా తగ్గుముఖమైంది. ఈసారి కోవిడ్‌ బెడద అంతగా లేకపోవడంతో మద్యం షాపులు కళకళలాడాయి.  క్రిస్మస్‌ నుంచి నెలాఖరు వరకు వ్యాపారం ఊపందుకుంది.  

20 లక్షల లీటర్ల మద్యం తాగేశారు  

  • డిసెంబర్‌ 31న సుమారు మూడు లక్షల లీటర్ల మద్యం, 2.41 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనిద్వారా ఎక్సైజ్‌ శాఖకు రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది.  
  • డిసెంబర్‌ 21 నుంచి 31వ తేదీ వరకూ లెక్కిస్తే 20.66 లక్షల లీటర్ల మద్యం, 15.04 లీటర్ల బీర్లను తాగారు. తద్వారా రూ.1,262 కోట్ల వ్యాపారం జరిగితే, పన్ను రూపంలో ఎక్సైజ్‌ శాఖ రూ.651 కోట్లు ఆర్జించింది.  
  • గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే రికార్డు ఆదాయమని ఎక్సైజ్‌వర్గాలు తెలిపాయి. 
  • న్యూ ఇయర్‌కు చర్చి స్ట్రీట్‌లో పబ్‌లకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. దీంతో మామూలు కంటే 50 శాతం ధరను పెంచారు. అయినా కూడా యువతీ యువకులతో పబ్‌లు కిటకిటలాడాయి. 

(చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top