ప్రారంభమైన రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’

Published Sun, Jan 14 2024 5:03 PM

Rahul Gandhi kickstarts Bharat Jodo Nyay Yatra Thoubal Manipur - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. మణిపూర్‌ ప్రజలు తమ ఆవశ్యకత, విలువను పోగొట్టుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏం కోల్పోయారో తాము చూశామని తెలిపారు.

మణిపూర్‌ ప్రజలు ఏం కోల్పోయారో వాటిని మళ్లీ అందిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్‌ ప్రజల బాధలు చూశామని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దు:ఖాన్ని తాము తొలగిస్తామని అన్నారు. ఇక్కడ ప్రజల్లో మునుపటిలా శాంతి, ప్రేమ, శ్రేయస్సును పునరుద్ధరిస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. 

న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్‌ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను..  మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు.  

చదవండి:  ‘రాహుల్‌’ రాజకీయం.. కాంగ్రెస్‌ను వీడిన 11 మంది సీనియర్లు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement