కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.
పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్‌కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్‌టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఏన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్‌పీఏ కూటమిలోని డీఎమ్‌కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి.ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు.
ఎస్‌ఏఎస్ గ్రూప్
NDA-17-19
CONG 11-12
OTH 1-3
చాణక్య స్ట్రాటజీస్
NDA- 17-20
SPA - 9-13
TVK - 1


