
ఢిల్లీ: ‘సాక్షి’ జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు పెట్టడాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. సాక్షి జర్నలిస్టులను కేసులతో వేధించడం సరికాదని స్పష్టం చేసింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేసింది.
‘సాక్షి జర్నలిస్టులపై వివిధ జిల్లాలలో నాలుగు కేసులు పెట్టారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రిపోర్టు చేసినందుకు రెండు వేరువేరు పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు . ఈ మీడియా సమావేశాన్ని ఇతర న్యూస్ పేపర్లు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి
అయినా కేవలం సాక్షి దినపత్రికనే టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారు. సాక్షి పత్రిక పై ఎడిటోరియల్ స్టాఫ్‌పై ఉద్దేశపూర్వకంగానే సెలెక్టివ్గా క్రిమినల్ కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి , పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కిందనడానికి ఇదొక కేస్ స్టడీ లాంటిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1 )ఏ నుంచి జి కింద ప్రసాదించిన వాక్ స్వాతంత్రపు హక్కును కాల రాస్తున్నారు. ఎడిటోరియల్ వివాదాలను క్రిమినల్ చట్టాల కింద కాకుండా సివిల్ చట్టాల కింద పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా పేర్కొంది.