అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే.. | PM Narendra Modi Did Ayodhya Ram Temple Consecration, Ram Lalla Idol First Visuals Goes Viral - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే

Published Mon, Jan 22 2024 12:39 PM

PM Narendra Modi Did Ayodhya Ram Temple Consecration - Sakshi

ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. 

మేషలగ్నం అభిజిత్‌ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది.  విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్‌లతో పూల వర్షం కురిపించారు. 

 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్‌ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది.  ఆ దివ్యరూపం సోషల్‌ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. 

దర్శన వేళలు ఇవే
అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్‌లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం​. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement