
అందుకే విమానం కూలింది.. ఎయిరిండియా ప్రమాదంపై ఏఏఐబీ
ఆఫ్ అయిన రెండు ఇంధన స్విచ్‌లు
ఏపీయూ డోర్ కూడా తెరుచుకుంది
ప్రాథమిక నివేదికలో కీలకాంశాలు
పూర్తి ఆడియో బయటపెట్టని వైనం
పైలట్ల తప్పిదమేనంటూ సంకేతాలు
తీవ్రంగా తప్పుబట్టిన పైలట్ల సంఘం
‘ఇంధన నియంత్రణ స్విచ్‌ను ఎందుకు ఆపేశావు?’ – ఆదుర్దాగా ప్రశ్నించిన పైలట్
‘నేను ఆపలేదు’ – బదులిచ్చిన రెండో పైలట్
దేశమంతటినీ శోకసంద్రంలో ముంచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి క్షణాల ముందు పైలట్ల తుది సంభాషణ ఇది. వారిమధ్య నెలకొన్న అయోమయానికి ఈ సంభాషణ అద్దం పడుతోందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేర్కొంది.
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ, ఇప్పటిదాకా వెలుగు చూసిన కీలకాంశాలతో రూపొందించిన 15 పేజీల ప్రాథమిక నివేదికను సంస్థ శనివారం విడుదల చేసింది. ‘‘విమానం టేకాఫైనక్షణాల్లోనే రెండు ఇంజన్ల తాలూకు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఒక్క సెకన్ వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటి ‘రన్’ నుంచి ‘ఆఫ్’ మోడ్‌కు మారిపోయాయి. దాన్ని గమనించగానే పైలట్లు పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు.
అప్పటికే ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో విమానం పైకెగిరేందుకు అత్యవసరమైన థ్రస్ట్ లభించలేదు. అప్పటికి కేవలం 625 అడుగుల ఎత్తుకు మాత్రమే వెళ్లిన విమానం అక్కణ్నుంచి శరవేగంగా కిందకు దిగడం మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పైలట్లిద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. తొలుత మొదటి ఇంజన్ ఇంధన స్విచ్‌ను, రెండు సెకన్లలోనే రెండో స్విచ్‌ను ఆన్ చేసినా లాభం లేకపోయింది. మొదటి ఇంజన్ కాసేపు రికవరీ అయినట్టే కనిపించినా ఆ వెంటనే చేíÙంచిన మీదట ఏఏఐబీ ఈ మేరకు అంచనాకు వచ్చింది
‘‘విమానానికి విద్యుత్ సరఫరా చేసే ఆగ్జిలరీ పవర్ యూనిట్ (ఏపీయూ) ఇన్‌లెట్ డోర్ టేకాఫ్ ప్రక్రియ పూర్తవకుండానే అనూహ్యంగా తెరుచుకుంది. ఇంజన్లు మొరాయించిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. విమానం చుట్టూ వాయు ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల పరిణామమిది!’’ అని వివరించింది. స్విచ్‌లు ఆఫ్ కావడానికి ఏఏఐబీ ఎలాంటి కారణమూ పొందుపరచకపోయినా, ‘‘ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆటోమేటిగ్గా పని చేయవు. ఎవరో ఒకరు పూనుకుని వాటిని ఆన్, ఆఫ్ చేయాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. తద్వారా, పైలట్లే పొరపాటున ఆ పని చేసి ఉంటారనే సంకేతాలిచ్చింది.
అంతా 32 సెకన్లలోపే...
ఇదీ ప్రమాదక్రమం...
⇒ ఉదయం 11.17: ఢిల్లీ నుంచి
⇒ అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం
⇒ మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్ 23 నుంచి టేకాఫ్ అయిన విమానం
⇒ మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్ వేగం అందుకున్న విమానం. అదే సమయంలో ‘రన్’ పొజిషన్ నుంచి ‘కటాఫ్’కు మారిన రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు
⇒ 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్ పవర్ అందించేందుకు రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్‌ఏటీ) పంప్ క్రియాశీలమైంది.
⇒ 1.38:52: ఆన్ అయిన ఒకటో ఇంజన్ స్విచ్
⇒ 1.38:54: తెరుచుకున్నఏపీయూ ఇన్‌లెట్ తలుపు
⇒ 1.38:56: ఆన్ అయిన రెండో ఇంజన్ స్విచ్
⇒ 1.39:05: పైలట్ ప్రమాద (మే డే) సందేశం
⇒ 1.39:11: తుది డేటా నమోదు. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయిన విమానం