Narendra Modi: భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కండి!

PM Narendra Modi to chair crucial meet on Friday to review COVID-19 - Sakshi

పిల్లలు, యువతపై కరోనా ప్రభావాన్ని రికార్డ్‌ చేయండి

టీకా వృథాను అరికట్టండి

క్షేత్రస్థాయి అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: పిల్లలు, యువతలో కరోనా వైరస్‌ వ్యాప్తిని, వారిపై దాని ప్రభావాన్ని, తీవ్రతను నిశితంగా పరిశీలించి, రికార్డు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. దేశంలో కరోనా వైరస్‌ ఉన్నంతవరకు, అది ఎంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. కోవిడ్‌ 19 సవాలు కొనసాగుతుందని హెచ్చరించారు. కరోనా ముప్పుపై దేశవ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రధాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైరస్‌లో కొత్త కొత్త మ్యుటేషన్ల కారణంగా ముందుముందు చిన్న పిల్లలపై పెను ప్రభావం పడనుందని పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన వారితో పంచుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆయా జిల్లాల్లో అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. వాటిని విశ్లేషించి, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని ఆదేశించారు.

గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డేటాను సమకూర్చుకుని, విశ్లేషించుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని సూచించారు. గతంలో కేసులు తగ్గుముఖం పట్టగానే.. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి, జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ప్రధాని గుర్తు చేశారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

కేసులు తగ్గడం ప్రారంభం కాగానే, ముప్పు తొలగిందని భావించకూడదని, వైరస్‌ ఉన్నంతవరకు ఈ సవాలు కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి అధికారుల విధులు, బాధ్యతలను మరింత విస్తృతం, క్రియాశీలం చేసిందన్నారు. అప్పటికప్పుడు కొత్త వ్యూహాలు, ప్రణాళికలు, పరిష్కారాలను సిద్ధం చేసుకోవాల్సిన సవాళ్లతో కూడిన పరిస్థితి నెలకొందన్నారు. వైరస్‌లో ఏర్పడుతున్న ఉత్పరివర్తనాలను ప్రస్తావిస్తూ.. ఇది ధూర్త, బహురూప వైరస్‌ అని వ్యాఖ్యానించారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

గడిచిన వందేళ్లలో ఇది అతిపెద్ద విపత్తు
రాష్ట్రాలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి తీసుకున్న సలహాలను పరిగణనలోకి తీసుకుని, టీకాల లభ్యత, పంపిణీ గురించి పక్షం రోజుల ముందే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సమాచారం ఇస్తోందని తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ప్రజలకు టీకాలు ఇచ్చే విషయంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో టీకాలను పంపిస్తామన్నారు. టీకాల వృథాను సాధ్యమైనంతగా అరికట్టాలని సూచించారు.

వృథా అయ్యే ప్రతీ డోసు ఒక ప్రాణాన్ని నిలబెట్టేంత విలువైనదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాలను కరోనా రహితంగా చేసేందుకు అధికారులంతా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘గత వందేళ్లలో అతిపెద్ద విపత్తు ఇది. అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతంగా కృషి చేసి, ఈ విపత్తును ఎదుర్కొంటున్నారు’ అని అధికారులను ప్రధాని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్తాన్, యూపీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి అధికారులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-05-2021
May 21, 2021, 09:44 IST
నాగబాబు కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. కొద్ది రోజుల క్రితమే నేను...
21-05-2021
May 21, 2021, 09:09 IST
కంటికి కనిపించని కరోనా ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. ఇక...
21-05-2021
May 21, 2021, 06:23 IST
సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.
21-05-2021
May 21, 2021, 06:11 IST
న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా...
21-05-2021
May 21, 2021, 06:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది....
21-05-2021
May 21, 2021, 05:27 IST
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోలా కరోనా సోకింది. ఐసోలేషన్‌లో ఉంటూ, జాగ్రత్తగా మందులు వాడుతూ.. కరోనా నుంచి బయటపడ్డారు.. మరి...
21-05-2021
May 21, 2021, 05:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్‌ విసురుతోంది. కరోనా...
21-05-2021
May 21, 2021, 05:03 IST
బ్లాక్‌ ఫంగస్‌ తరహాలోనే మనపై దాడిచేసే మరో మహమ్మారి.. వైట్‌ ఫంగస్‌. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్‌. ఇది...
21-05-2021
May 21, 2021, 03:02 IST
న్యూఢిల్లీ: కేవలం ఒకే ఒక సెకనులో కరోనా నిర్ధారణ ఫలితాన్ని బయటపెట్టే సెన్సార్‌ సిస్టమ్‌ను తాము అభివృద్ధి చేశామని అమెరికాలోని...
21-05-2021
May 21, 2021, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం...
21-05-2021
May 21, 2021, 02:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది....
21-05-2021
May 21, 2021, 02:25 IST
సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: ఇది ఒక్క దస్రు, పరిస్థితే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు....
21-05-2021
May 21, 2021, 02:04 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సోకి, కోలుకున్నామన్న సంతోషం తీరకముందే బ్లాక్‌ ఫంగస్‌ కాటేస్తోంది. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేశామన్న ఆనందం రెండుమూడు...
21-05-2021
May 21, 2021, 00:15 IST
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్‌ తెలిపారు....
21-05-2021
May 21, 2021, 00:15 IST
ప్రముఖ దర్శక–నిర్మాత, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) వియ్యంకుడు యు. విశ్వేశ్వర రావు (92) ఇక లేరు. గురువారం...
20-05-2021
May 20, 2021, 20:35 IST
లక్నో : గంగానదిలో వందకుపైగా కోవిడ్‌ మృతదేహాలు తేలుతూ కనిపించటంతో దేశవ్యాప్తంగా కల్లోలం చెలరేగింది. ఆ ఘటన మరువక ముందే కోవిడ్‌...
20-05-2021
May 20, 2021, 19:22 IST
చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్‌ ముకుంద్‌ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ...
20-05-2021
May 20, 2021, 18:36 IST
జెనీవా: కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు...
20-05-2021
May 20, 2021, 17:55 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,18,247...
20-05-2021
May 20, 2021, 15:27 IST
న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం నేడు కీలక విషయాలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top