
హసన్: దేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇదే కోవలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలోనే 18 మంది గుండెపోటుతో మరణించిన దరిమిలా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ మరణాలపై దర్యాప్తు చేప్టటాలని వైద్యాధికారులను ఆదేశించారు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలో 18 మంది గుండెపోటుతో మరణించగా, వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ విధమైన గుండెపోటు కేసుల పెరుగుదలను నివారించేందుకు వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారిక దర్యాప్తు జరుగుతోందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
హసన్ జిల్లాలో చోటుచేసుకున్న గుండెపోటు మరణాలపై జయదేవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సి.ఎన్. రవీంద్ర నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం అధ్యయనం చేసి, నివేదికను పది రోజుల్లోగా అందజేయనుంది. హసన్‌లో ఇటీవలి కాలంలో 20 నుంచి 30 ఏళ్లలోపు వయసుకలిగిన యువకులు గుండెపోటులో మృతిచెందడం గమనార్హం. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, అధిక ఒత్తిడిని కలిగించే జీవనశైలి మొదలైనవి గుండెపోటుకు ప్రధాన కారణాలని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక