Parliament Monsoon Sessions Begins: Live Updates - Sakshi
Sakshi News home page

Parliament Monsoon Sessions: పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా

Jul 20 2023 11:22 AM | Updated on Jul 20 2023 2:14 PM

Parliament Monsoon Sessions Begins Live Updates - Sakshi

Updates..

►పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మణిపూర్‌ ఘటనపై చర్యలు విపక్షాలు  పట్టుపట్టడంతో.. ఆందోళనలతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

►మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

► రాజ్యసభ సభలో గందరగోళం నెలకొంది. మణిపూర్‌ ఘటనపై చర్చకు టీఎంసీ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎం సభ్యులు ప్రశ్నించారు. దీంతో, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.   

► మణిపూర్‌ ఘటనపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్‌ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్‌ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుంది అని అన్నారు. 

► కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. 

► మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ వాయిదా. 

► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా. 

► ఇటీవల కన్నుమూసిన పార్లమెంట్‌ సభ్యులకు నివాళిగా రెండు సభాలు వాయిదా. 

► ఆప్ ఎంపీగా లోక్‌సభలో సుశీల్‌ కుమార్‌ రింకూ ప్రమాణం చేశారు.

► పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం. ‍ స్పీకర్‌ స్థానంలో ఓం బిర్లా కూర్చుని సెషన్స్‌ని ప్రారంభించారు. 

► మణిపూర్‌ ఘటనపై మోదీ సీరియస్‌ అయ్యారు. 

► మణిపూర్‌ ఘటన బాధాకరం. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసింది. మణిపూర్‌ రేపిస్టులను వదిలిపెట్టే ప్రస‍క్తే లేదు.

► మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. మణిపూర్‌ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. 

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement