ఆగకుండా నాన్‌స్టాప్‌గా వెళ్లిన రైలు,కారణం?

Non stop Train From Lalitpur to Bhopal For Rescue Three Year Girl - Sakshi

భోపాల్‌: కిడ్నాప్‌కు గురైన ఒక బాలికను రక్షించడం కోసం మొదటిసారిగా రైలు లలిత్పూర్‌ నుంచి భోపాల్‌ వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. నిందితుడు రైలులో ఒక పాపను ఎత్తుకొని వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న పోలీసు విభాగం రైలును ఎక్కడ ఆపకుండా భోపాల్‌ వరకు నడపాలని డ్రైవర్‌ను కోరింది. దీంతో లలిత్పూర్‌ నుంచి రైలును ఎక్కడా ఆగకుండా భోపాల్‌ వరకు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు.    

అసలేం జరిగిందంటే ఒక వ్యక్తి మూడేళ్ల చిన్నారిని అపహరించి భోపాల్‌కు వెళ్తున్న రాప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రైల్వే సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు స్టేషన్‌ మాస్టర్‌తో, ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు ఎక్కడ ఆపకుండా భోపాల్‌ వరకు తీసుకువెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. రైలు భోపాల్‌ చేరేవరకు అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడిని గుర్తించి పాపను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  చదవండి: దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top