సింగరేణి అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఆగ్రహం

The National Green Tribunal Expressed Anger Over Singareni Illegal Mining - Sakshi

న్యూఢిల్లీ: సింగరేణి అక్రమ మైనింగ్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ శనివారం ఆగ్రహం వ్యక్త చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్‌ చేస్తున్నారని మండిపడింది. నందునాయక్‌, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ చేపట్టింది. కాగా, అదనపు మైనింగ్‌పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్‌ చేయొద్దని సింగరేణిని ఎన్జీటీ ఆదేశించింది.

ఇప్పటికే చేపట్టిన అక్రమ మైనింగ్‌కు నష్టపరిహారం చెల్లించాని  పేర్కొంది. కాలుష్య బారిన పడిన బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని తెలిపింది. అంతేకాకుండా గ్రీన్‌బెల్ట్‌పై నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. కాగా తదుపరి విచారణను వచ్చేనెల(ఆగస్టు) 12కు వాయిదా వేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top