'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువ‌తి

Muslim Girl Got Tatoo Of SHRIRAM On Her Arm Know The Reasons - Sakshi

అయోధ్య :  రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అయోధ్యలో  ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హిందూ-ముస్లింల ఐక్య‌త‌కు అద్దం ప‌డుతూ నిద‌ర్శ‌నంగా నిలిచింది బెనార‌స్‌కు చెందిన ఇక్రా ఖాన్ అనే ముస్లిం యువ‌తి. త‌న చేతిమీద 'శ్రీరామ్' అనే అక్ష‌రాల‌ను పచ్చ‌బొట్టు వేయించుకుంది. త‌న‌తో పాటే ఎంతోమంది ముస్లిం సోద‌రులు సైతం శ్రీరాముని ఆలయ నిర్మాణం ప‌ట్ల సంతోషంగా ఉన్నారని తెలిపింది. ల‌క్ష‌లాది హిందువులు క‌ల‌లు క‌న్న శ్రీరాముని ఆల‌యం నిర్మించాల‌న్న కోరిక త‌న‌కు కూడా ఉంద‌ని, ఈ క్ష‌ణం కోసం ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్నాన‌ని పేర్కొంది. అయోధ్యలో శ్రీరాముని ఆల‌య నిర్మాణ ప‌నుల‌కు ముందే హిందూ- ముస్లిం ఐక్య‌త‌ను చాటిచెప్పేందుకే తాను ఈ టాటూ వేయించుకున్న‌ట్లు తెలిపింది. అంతేకాకుండా తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిమాని అని ఇక్రా ఖాన్ వెల్ల‌డించింది. (భూమి పూజకు శ్రీకారం)

శ్రీరాముని టాటూ వేయ‌మ‌ని అడిగిన‌ప్ప‌డు ఆమె ముస్లిం యువ‌తి తెలిసి చాలా షాక్ అయ్య‌న‌ని టాటూ దుకాణ‌పు ఓన‌ర్ అశోక్ గోగియా తెలిపారు. వార‌ణాసిలోని సిగ్రా న‌గ‌రంలో ఉన్న టాటూ దుకాణాన్ని గ‌త కొన్నేళ్లుగా న‌డుపుతున్నాన‌ని, ఓ ముస్లిం యువ‌తి శ్రీరాముని టాటూ వేయించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆగ‌స్టు 5 లోపు శ్రీరాముని టాటూలు వేయించుకున్న వారికి ఉచితంగా టాటూలు వేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ముస్లిం యువ‌తి ప్రేర‌ణ‌తోనే తాను ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాన‌ని అశోక్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే అయోధ్య‌తో పాటు కాశీలోని ప్ర‌ధాన దుకాణాల‌న్నీ శ్రీరాముని విగ్ర‌హాలు, ప‌టాల‌తో నిండిపోయాయి. రేపు (బుధ‌వారం) జ‌ర‌గనున్న భూమి పూజ‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. (మోదీ శపథం.. 28 ఏళ్ల తరువాత తొలిసారి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top