బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోలు మృతి | Massive Encounter In Bijapur | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

Nov 5 2025 5:15 PM | Updated on Nov 5 2025 7:21 PM

Massive Encounter In Bijapur

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇరువైపుల నుంచి వరుసగా కాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్‌లోని అనారం, మర్రిమల్ అడవుల్లో ముగ్గురు నక్సల్స్ ను జవాన్లు హతమార్చారు. అన్నారం, మారిమల్ల అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.

ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో, గరియాబంద్ E30, STF, COBRA బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య అడపాదడపా ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతున్నాయి.

కాగా, కీలక మహిళా నేత సునీతక్క మరికొందరు మావోయిస్టులతో కలిసి ఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయిన సంగతి తెలిసిందే. లొంగిపోయిన మావోయిస్టుల మీదున్న రివార్డులను పోలీసులు అందించారు. సునీతక్క 2022లో మావోయిస్టు పార్టీలో చేరి మాడ్ ప్రాంతంలో 6నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం పార్టీలో కీలక నేతగా ఎదిగి అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు.

Maoists:  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement