నోటికొచ్చిన లెక్కలతో మృతుల సంఖ్య పెంచే ప్రయత్నం చేసిన బెంగాల్ సీఎం

Mamata Benarjee Increases Death Toll  - Sakshi

ఒడిశా రైలు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మృతుల సంఖ్యపై స్పష్టమైన అవగాహన లేకుండా నోరుజారడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ రాజకీయ జీవితమంతా శవరాజకీయాలతోనే  సాగిందని విమర్శలు చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి సమక్షంలోనే నోటికొచ్చిన లెక్కలు...  
ఒడిశా రైలు ప్రమాద సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న మమతా బెనర్జీ వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ మృతుల సంఖ్య 500 వరకు పెరిగే అవకాశముంది, ఎందుకంటే ఇంకా మూడు భోగీల వరకు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఆ సమయంలో అక్కడే నిల్చుని ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్  వెంటనే స్పందించి "సహాయక చర్యలు అయిపోయాయి మేడమ్ , మృతుల సంఖ్య 238 మాత్రమే..." అని ఆమెను సవరించే ప్రయత్నం చేశారు. దీంతో మమతా మళ్ళీ అందుకుని అది అంతకుముందు లెక్క అంటూ గొంతు పెంచారు. ఇంతలో పక్కనే ఉన్న మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కల్పించుకుని.. "తర్వాత మాట్లాడదాం.." అని కట్ చేశారు. 

ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో నెటిజన్లు బెంగాల్ సీఎంపై కామెంట్లు చేస్తున్నారు. సింగూర్ హింసాకాండతో మొదలు, శవ రాజకీయాలు చేసే ఈ స్థాయికి వచ్చారు. చావులు, అరాచకాలతోనే నీచమైన రాజకీయాలకు అలవాటు పడిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు.          

ఇది కూడా చదవండి: ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top