Major Fire Accident In Furniture Factory at Gujarat Rajkot, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Rajkot Fire Accident: గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నిచర్ గొడౌన్ దగ్ధం.. 

Jun 22 2023 1:55 PM | Updated on Jun 22 2023 3:06 PM

Major Fire Accident In Furniture Factory at Gujarat Rajkot  - Sakshi

గుజరాత్ : రాజ్ కోట్ లోని ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారమందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. 

రాజ్ కోట్ లోని ఆనంద్ బంగ్లా చౌక్ సమీపంలో ఉన్న ఒక ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గాని  ఆస్తినష్టం ఎంత వరకు జరిగి ఉండవచ్చన్న వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..

Advertisement
 
Advertisement
Advertisement