బ్రహ్మపురిః47.2  | Maharashtra Brahmapuri hottest in country at 47. 2 degrees | Sakshi
Sakshi News home page

బ్రహ్మపురిః47.2 

May 25 2026 4:59 AM | Updated on May 25 2026 4:59 AM

Maharashtra Brahmapuri hottest in country at 47. 2 degrees

న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు మండుతున్న ఎండలతో అల్లాడుతున్నాయి. ఆదివారం మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉన్న బ్రహ్మపురిలో దేశంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత్ర రికార్డయ్యింది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువ. 

యూపీలోని బాందాలో 46.8, రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 46 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 46, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో 45.6, వార్థాలో 45.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రాజస్తాన్‌లో 47 డిగ్రీల వరకు నమదయ్యే అవకాశముందంది. కాగా, మే 29వ తేదీ తర్వాత క్రమేపీ ఎండల నుంచి ఉపశమనం కలగనుందని ఐఎండీ అంచనా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement