న్యూ ఇయర్‌ జోష్‌కు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ జోష్‌కు బ్రేక్‌

Published Sat, Dec 5 2020 7:17 AM

Karnataka Govt Plans Restrictions On New Year Celebrations - Sakshi

సాక్షి, బెంగళూరు : కరోనా రెండో దశ ప్రబలే ప్రమాదం ఉండటంతో కొత్త సంవత్సర వేడుకలపై  ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోవిడ్‌ సాంకేతిక సల­హా సమితి సిఫార్సుల మేరకు క్రిస్‌మస్, న్యూ ఇయర్‌తో పాటు ధార్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, వివాహాది శుభకార్యాల్లో ఎక్కువమంది ప్రజలు చేరకుండా నిషేధాజ్ఞలు విధించే అవకాశాలు ఉన్నా­యి. కోవిడ్‌ సాంకేతిక సలహా సమితి సభ్యులతో శుక్రవారం సమావేశమైన ఆరోగ్య, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడారు.  చదవండి: (8న భారత్‌ బంద్‌)

వివా­హానికి వందమంది, రాజకీయపార్టీలు సభలు సమావేశాలకు 200 మంది, అంత్యక్రియలకు 50 మందిని పరిమితం చేయాలని డాక్టర్‌ సుదర్శన్‌ నేతృత్వంలోని కోవిడ్‌–19 సాంకేతిక సలహా సమితి నివేదిక అందించిందన్నారు. ఈ నివేదిక అమలుపై సీఎంతో చర్చించి తీర్మానం చేస్తామని తెలిపారు. ప్రస్తుతానికి కర్ఫ్యూ విధించే ప్రతి­పాదన ప్రభుత్వం ముందులేదన్నారు. డిసెంబరు 20 నుంచి జనవరి 2 వరకు మార్గదర్శకాలు పాటించాలన్నారు.  

Advertisement
Advertisement