కేదార్‌నాథ్‌లో 228 కేజీల గోల్డ్‌ స్కామ్‌: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద | Jyotirmath Shankaracharya Meets Uddhav Thackeray At Mumbai | Sakshi
Sakshi News home page

‘ఉద్దవ్‌థాక్రేకు అన్యాయం జరిగింది.. ఢిల్లీలో కేదార్‌నాథ్‌ కట్టలేం’

Jul 15 2024 6:07 PM | Updated on Jul 15 2024 6:23 PM

Jyotirmath Shankaracharya Meets Uddhav Thackeray At Mumbai

ముంబై: కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందన్నారు జ్యోతిర్‌మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి. సుమారు 228 కిలోల బంగారం మాయమైంది దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.

కాగా, అవిముక్తేశ్వరానంద ఈరోజు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో థాక్రే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేకు అతిపెద్ద ద్రోహం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే త్వరలో తిరిగి ముఖ్యమంత్రి పదవికి రావాలని ఆయన ఆకాంక్షించారు.  ఉద్దవ్‌కు కొందరు నమ్మించి మోసం చేశారు. ప్రజలు అన్నీ గమనించాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ త‌న‌కు ప్రణామాలు చేశార‌ని, త‌మ ద‌గ్గరికి వ‌చ్చిన‌వాళ్లను దీవించ‌డం త‌మ విధాన‌మ‌ని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ త‌మ‌కు శ‌త్రువు కాదన్నారు. ఒక‌వేళ ఆయ‌న త‌ప్పు చేస్తే, ఆ విష‌యాన్ని ఎత్తి చూపుతామ‌ని అన్నారు.

మరోవైపు.. కేదార్‌నాథ్‌లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు. కేదార్‌నాథ్ ఆల‌యం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌ర‌గ‌లేద‌న్నారు. దీనికి ఎవ‌రు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని ర‌కాల స్కామ్‌ల‌కు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆల‌యాన్ని క‌డుతామ‌ని అన‌డ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మించలేం. పన్నెండు జ్యోతిర్లింగాలు నిర్వచించబడ్డాయి. దాని స్థానం స్థిరంగా ఉంది. అది తప్పు అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement