హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి | Jind Dushyant Chautala Convoy Attacked | Sakshi
Sakshi News home page

హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి

Oct 1 2024 10:01 AM | Updated on Oct 1 2024 11:32 AM

Jind Dushyant Chautala Convoy Attacked

జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్‌లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ రోడ్ షోలో దుష్యంత్‌తో పాటు ఆజాద్‌ సమాజ్‌ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు  ముమ్మర దర్యాప్తు చేపట్టారు.  ఈ దాడిలో చంద్రశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్‌ అసెంబ్లీ అభ్యర్థిగా  ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement