'తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా'

Published Sun, Jul 3 2022 6:03 PM

Jammu Kashmir BJP Leader Kavinder Gupta Comments Telangana Visit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ పర్యటనలో భాగంగా అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా. తెలంగాణ ప్రజల ప్రేమ జీవితంలో మర్చిపోలేను’అని జమ్మూకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా అన్నారు. ‘బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నాలుగు రోజుల కిందట బెల్లంపల్లి గ్రామానికి వెళ్లాను. ఏడు సార్లు భోజనం చేస్తే అందులో ఆరుసార్లు వైశ్య సంఘాలే పెట్టాయి. వ్యాపారాల్లో ఉంటూనే దేశ ప్రగతిలో వైశ్యులు పాలుపంచుకుంటున్నారు’అని తెలిపారు.

శనివారం రాత్రి అఖిల భారత వైశ్య సంఘం (ఏఐవైఎఫ్‌) మహా సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గోపాల్‌ మోర్‌ మాట్లాడుతూ దేశంలో కోటిన్నర కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న వైశ్య వ్యాపారులకు నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 3.50 కోట్ల మంది వైశ్యులున్నారని, కరోనా టైంలో కూడా ఈ కమ్యూనిటీ పేదల కడుపు నింపిందని పేర్కొన్నారు. దేశంలోని వైశ్య సంఘానికి కూడా అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు గిరీశ్‌ సంఘీ, ఇతర ప్రతినిధులు జైస్వాల్, రాజేశ్‌అగర్వాల్, జితేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

చదవండి: (బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి)

Advertisement
Advertisement