పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌

Indian Government Announced Padma Awards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఏడుగురికి పద్మ విభూషణ్.. 10 మందికి పద్మ భూషణ్‌.. 102 మంది పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. దివంగత సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్‌.. సినీగాయని చిత్ర పద్మభూషణ్‌ పొందారు. ఏపీ నుంచి ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్న వరపు, నిడుమోలు సుమతి.. సాహిత్యం, విద్యలో  ప్రకాశ రావు అశావాది.. ఇక తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజులకు పద్మశ్రీలు దక్కాయి.

మరణానంతరం అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌లు పద్మభూషణ్ పొందారు. ఇక విదేశం నుంచి జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మవిభూషణ్ దక్కింది. వీటితో పాటు అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్రం మహావీరచక్ర పురస్కారం ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top