ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సంచలన ప్రకటన | Indian Airforce Key Announcement On Operation Sindoor | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సంచలన ప్రకటన

May 11 2025 12:47 PM | Updated on May 11 2025 1:44 PM

Indian Airforce Key Announcement On Operation Sindoor

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ ిసిందూర్‌ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. మాకు అప్పగించిన టార్గెట్‌లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాం. విచక్షణ, వివేకంతో ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించాం. ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌పై ఊహాగానాలు, ఫేక్‌ వార్తలు నమ్మవద్దు అని అధికారులు చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్‌-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement