దేశమంతటా టీకా పండుగ

India Over 1,91,181 people vaccinated on Day 1 - Sakshi

ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కోలాహలం

ఢిల్లీ పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా

దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికి వ్యాక్సిన్‌

ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్‌ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్‌ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి.

మనీశ్‌ కుమార్‌ ఫస్ట్‌
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్‌ కుమార్‌(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో అతడికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ పాల్గొన్నారు. మనీశ్‌ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్‌ కుమార్‌ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు.

థాంక్యూ మనీశ్‌ కుమార్‌
దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్‌ కుమార్‌కు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్‌ కుమార్‌ కోవిడ్‌–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు.

టీకా తీసుకున్న ప్రముఖులు
కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా, పశ్చిమ బెంగాల్‌ మంత్రి నిర్మల్‌ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

తొలిరోజు 1,91,181 మందికి..
దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్‌ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్‌ కూడా అందజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-02-2021
Feb 25, 2021, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం...
25-02-2021
Feb 25, 2021, 01:15 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌...
24-02-2021
Feb 24, 2021, 10:14 IST
మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు
24-02-2021
Feb 24, 2021, 03:16 IST
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా...
24-02-2021
Feb 24, 2021, 03:14 IST
పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్‌ భయం నెలకొంది.
23-02-2021
Feb 23, 2021, 18:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా...
23-02-2021
Feb 23, 2021, 04:09 IST
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు....
23-02-2021
Feb 23, 2021, 03:09 IST
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం...
23-02-2021
Feb 23, 2021, 02:55 IST
లండన్‌: యూకేలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను నాలుగు దశల్లో ఎత్తి వేసేందుకు ఉద్దేశించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రధానమంత్రి...
22-02-2021
Feb 22, 2021, 15:11 IST
ముంబై సెంట్రల్ ‌: ముంబై నగర పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈసారి...
22-02-2021
Feb 22, 2021, 11:34 IST
రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే  లాక్‌డౌన్‌ తప్పదు
22-02-2021
Feb 22, 2021, 03:58 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు...
21-02-2021
Feb 21, 2021, 14:33 IST
పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలను సైతం మూసివేశారు.
21-02-2021
Feb 21, 2021, 05:21 IST
న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం...
21-02-2021
Feb 21, 2021, 05:13 IST
కరోనా మహమ్మారి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెచ్చరించింది.
20-02-2021
Feb 20, 2021, 09:00 IST
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్‌ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని...
20-02-2021
Feb 20, 2021, 09:00 IST
కరోనాతో బాధపడుతున్న సంగారెడ్డికి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు (50) గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం మృతిచెందారు.
20-02-2021
Feb 20, 2021, 08:39 IST
'మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్‌ను దొంగిలించారు' అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ...
19-02-2021
Feb 19, 2021, 20:46 IST
ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.
19-02-2021
Feb 19, 2021, 16:11 IST
ప్రజల్లో కరోనా పట్ల పెద్దగా భయం లేకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు.  
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top