
కోల్‌కతా: పశ్చిమబెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో హోలీ వేళ దారుణం చోటుచేసుకుంది. హోలీ ఆడుతున్న 20 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పండుగపూట అందరిలో విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీటాగఢ్‌కు చెందిన ఆకాశ్ చౌదరి(20) ఉరఫ్ అమర్ తన ఇంటికి సమీపంలో స్నేహితులతో పాటు హోలీ(Holi) ఆడుతున్నాడు. ఇంతలో నలుగురు యువకులు అతని మెడ, శరీరంలోని ఇతర భాగాలపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు ఆకాశ్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు అతనిని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ(RG Kar Medical College)కి పంపించారు.
అక్కడి వైద్యులు ఆకాశ్ అప్పటికే మృతి చెందాడని నిర్థారించారు. ఈ కేసులో పోలీసులు ఆకాశ్‌పై దాడికి పాల్పడిన పవన్ రాజ్‌భర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతను గతంలో ఒక కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆకాశ్‌పై దాడికి పాల్పడిన మరో ఇద్దరు పరారయ్యారు. ఆకాశ్ బంధువు ఒకరు మాట్లాడుతూ ఆకాశ్ కాలేజీలో చదువుకుంటున్నాడని, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి పరిషత్ సభ్యునిగా ఉన్నాడని తెలిపారు. ఆకాశ్‌పై దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇది కూడా చదవండి: New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని