
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.
ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు.
Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT
— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025
వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్‌పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం
Comments
Please login to add a commentAdd a comment