ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం

Heavy rains, landslides force govt to halt Char Dham yatra - Sakshi

చార్‌ధామ్‌ యాత్రలో చిక్కుకుపోయిన 300 మంది భక్తులు

జోషిమఠ్‌: ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్రోగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపుగా 300 మంది చిక్కుకుపోయారు. లిపులేఖ్‌–తవాఘాట్‌ రోడ్డులో అతి పెద్ద కొండ చరియ విరిగి పడడంతో దాదాపుగా 100 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ధరాచులా, గంజి ప్రాంతంలో 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు జిల్లా అధికారులు వెల్లడించారు.

ఈ రోడ్డుకి మరమ్మతులు నిర్వహించి తిరిగి రాకపోకలు సాగించడానికి మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిత్రోగఢ్, రుద్రప్రయాగ, తెహ్రిగర్వాల్, ఉధామ్‌సింగ్‌ నగర్, ఉత్తర కాశీ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చార్‌దామ్‌ యాత్రలో ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని మరో రెండు మూడు రోజుల పాటు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top