ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ పెరుగుతుందా?

Health Tips To Increase Flow In Lungs - Sakshi

హైదరాబాద్‌: రోగులు పడక మీద బోర్లా పడుకోవడం వల్ల, లేదా టేబుల్‌కు ఛాతీని ఆనించి ఉంచడం వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ మోతాదులు పెరుగుతాయి. ఇలా రోగికి ఆక్సిజన్‌ అందించే  ప్రక్రియను ‘అవేక్‌ ప్రోనింగ్‌’ లేదా ‘ప్రోన్‌ వెంటిలేషన్‌’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా ఆక్సిజన్‌ అందుతుంది.. ‘ఆక్సిజనేషన్‌’ ఎక్కువగా జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఆక్సీమీటర్‌ మీద 80 ఉన్న రోగికి (ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చక్కర్లు కొడుతోంది.

దాని సారాంశం ఏమిటంటే.. కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమై ఆక్సిజన్‌ మీద ఉన్న ఒక పేషెంట్‌కు అక్కడి డాక్టర్లు ఆక్సిజన్‌ ఇస్తున్నారు. ఇంతలో పెద్ద డాక్టర్లు వచ్చి... ఆక్సీమీటర్‌ మీద 80 ఉన్న రోగికి ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం లేదనీ, సదరు రోగిని బోర్లా పడుకోబెట్టడం వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ పాళ్లు పెరుగుతాయని చెప్పి, ఆక్సిజన్‌ తొలగించారన్నది) ఇది ఉపయోగపడుతుందనడం మాత్రం అవాస్తవం.

అలాంటివారికి ఆక్సిజన్‌ పెట్టి తీరాలి. సాధారణంగా రోగులు తమ ఆక్సిజన్‌ మోతాదులను ఆక్సీమీటర్‌లో చెక్‌ చేసుకున్నప్పుడు ఆ విలువ 95 కొలత ఉండటం అవసరం. అంతకంటే కొంత తగ్గి... ఏ తొంభై నాలుగో, తొంభై మూడో ఉన్నప్పుడు ఇలాంటి చర్య పనికి వస్తుందిగానీ.. బోర్లా పడుకోవడం అనే ప్రక్రియ వల్ల గణనీయంగా ఆక్సిజనేషన్‌ పెరగదు. ఇలాంటి పోస్ట్‌లను నమ్మడం వల్ల రోగికి ముప్పే తప్ప... ప్రయోజనం ఉండదని రోగులు, ప్రజలు గ్రహించడం అవసరం.

- డాక్టర్‌ ముఖర్జీ
సీనియర్‌ కార్డియాలజిస్ట్

చదవండి: 
పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..?

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top