ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు తీర్పు

Haryana High Court Says Muslim Girls Can Marry At The Age Of 16 - Sakshi

ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. 

వివరాల ప్రకారం.. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్ 8వ తేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ.. కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.  

ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు తన తీర్పులో ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరిస్తూ.. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది. 

ఇది కూడా చదవండి: మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top