అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్‌ టవర్స్‌.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఓ రైల్వే స్టేషన్‌కు ఈ రేంజ్‌ డిజైన్‌ అవసరమా?

Published Mon, Sep 5 2022 8:31 AM

Future Look Of New Delhi Train Station Netizens Not Happy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్‌ టవర్స్‌ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్‌ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ (ఎన్‌డీఎల్‌ఎస్‌) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్‌పై నెటిజన్స్‌ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్‌ పార్కింగ్, పికప్, డ్రాప్‌ జోన్స్, 91 బస్‌బేలు, 1,500 ఈసీఎస్‌ పార్కింగ్‌లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్‌ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటోస్‌ను 5వేల మంది రీట్వీట్‌ చేశారు.  

► ఓ రైల్వే స్టేషన్‌కు అంత సంక్లిష్టమైన డిజైన్‌ అవసరమా?
► నిర్మాణానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్‌ను మరింత పెంచుతుంది.
► డిజైన్‌ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్‌లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్‌గంజ్‌ నివాసితులను ఏం చేస్తారు? 
► హైప్‌డ్‌ డిజైన్‌తో అనవసరమైన ఖర్చు. సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది.
► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు.
చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్‌ చార్జీ రూ.112

Advertisement
 
Advertisement
 
Advertisement