ఆ రాష్ట్రాలలో డాక్టర్లకు జీతాల్లేవ్‌..!

Five States Havent Paid Salaries To Doctors - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సమస్త మానవాళిని కబళిస్తోంది. కరోనా సోకిన రోగులను సొంత కుటుంబీకులే దూరం పెడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా రోగులకు చికిత్స చేసి డాక్టర్లు పునర్జన్న ప్రసాదిస్తున్నారు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న డాక్టర్లకు మాత్రం ఐదు రాష్ట్రాలలో(న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, త్రిపుర, కర్ణాటక) జీతాలు చెల్లించడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. యునైటెడ్ రెసిడెంట్స్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. కాగా అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ నేపథ్యంలో వారంలోపు డాక్టర్లకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఆగస్టు 10లోపు డాక్టర్లకు జీతాలు చెల్లించాలని కోర్టు తెలిపింది. అయితే క్వారంటైన్‌లో ఉన్న డాక్టర్లను క్యాజువల్‌ లీవ్‌లు అప్లై చేయాలని యాజమాన్యాలు వేధిస్తున్నాయని కోర్టుకు అసోసియేషన్‌ విన్నవించింది. పరిమిత స్థాయిలో క్యాజువల్‌ లీవ్‌లు ఉండడం వల్ల డాక్టర్లకు యాజమాన్యాలు జీతాల కోత విధిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని, ఒకవేళ చేయని పక్షంలో ఇండియన్‌ పీనియల్‌ కోడ్‌ డీఎం(విపత్తు నిర్వహణ చట్టం) ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.

అసోసియేషన్‌ అభిప్రాయాన్ని సొలిసిట్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఏకీభవించారు. ఆయన స్పందిస్తూ.. డాక్టర్లకు జీతాలు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం సూచించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జీతాల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది.
చదవండి: క‌రోనాకు యువ‌త అతీతం కాదు: డ‌బ్ల్యూహెచ్‌వో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top