జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ | Encounter Between Joint Forces and a Group of Militants | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Aug 7 2024 7:01 AM | Updated on Aug 7 2024 8:50 AM

Encounter Between Joint Forces and a Group of Militants

జమ్ముకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్  జరిగింది. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం  అణువణువునా గాలిస్తున్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఖనేడ్ అడవిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు ఇన్‌పుట్‌ అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, కాల్పులు ప్రారంభించాయి. అటవీప్రాంతంలో నలువైపులా ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులతో కూడిన జైషే గ్రూపు రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు చెట్లలో దాక్కొనగా, మరొక గ్రూపు తప్పించుకుంది. బసంత్‌గఢ్‌లోని ఖనేడ్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని డీఐజీ మహ్మద్ రైస్ భట్ తెలిపారు.

దీనికిముందు అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్‌పోరా తవేలాకు చెందినవారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement