డీఆర్‌డీఓ మరో అరుదైన ఘనత

DRDO successfully tests Hypersonic Technology Demonstrator Vehicle At odisha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్‌ని విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరంలో సోమవారం ఈ పరీక్షను నిర్వహించారు. వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో పనిచేయనున్న హైపర్ సోనిక్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజన్‌ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ అరుదైన ఘనత సాధించిన దేశాల జాబితాలో భారత్‌ నాలుగో దేశంగా గుర్తింపు పొందింది. హైపర్ సైనిక్ టెక్నాలజీ టెస్ట్ విజయవంతంతోమరిన్ని క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు సులువుగా దొరికే అవకాశం ఉంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు సంస్థ చైర్మన్‌  సతీష్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాజా ప్రయోగంతో భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలిపారని ప్రశంసించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top