ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారంటే..? | Jagdeep Dhankhars Resignation Starts Race For Next Vice President, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారంటే..?

Jul 22 2025 7:14 AM | Updated on Jul 22 2025 10:13 AM

Dhankhars Resignation Starts Race for Next Vice President

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో, తదుపరి ఈ పదవిని ఎవరు చేపడతారనేదానిపై చర్చ మొదలయ్యింది. అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆకస్మిక ఆకస్మిక రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జగదీప్ ధన్‌ఖడ్‌ పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నేత. అనుభవజ్ఞుడైన బీజేపీ సంస్థాగత నాయకుడు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.  ఇప్పుడు బీజేపీ ముందు ఈ పదవికి ఎంపిక చేసేందుకు పెద్ద జాబితానే ఉంది. ధన్‌ఖడ్‌కు ముందు ఈ పదవిలో ఉన్న ఎం వెంకయ్య నాయుడు అంతకుమందు బీజేపీ అధ్యక్షునిగానూ పనిచేశారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై పార్టీ చర్చిస్తోందని, వివాదాస్పదం కాని వ్యక్తిని  బీజేపీ ఎంపికచేస్తుందని, అలాగే పార్టీలో అనుభవజ్ఞుడైన  నేతకు ప్రాధాన్యత ఇస్తారని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

ధన్‌ఖడ్‌ మూడేళ్ల పదవీకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలతో తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇటువంటి వివాదాస్పద అంశాల విషయంలో ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పడకుండా కాపాడారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల  తొలి రోజున ఆయన రాజీనామా చేశారు. కాగా జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజకీయాలలో అనుభవజ్ఞునిగా పేరొందినందున ఆయన పేరు ఈ పదవికి ముందుగా వినిపిస్తోంది.

హరివంశ్  తొలిసారిగా 2014 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేశారు. జర్నలిజంలో డిప్లొమా  అందుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు ఆయన  చాలా సంవత్సరాలు జర్నలిస్ట్‌గా ఉన్నారు. బ్యాంకు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ జర్నలిస్ట్‌గానే పనిచేయాలని  అనుకున్నారు. ‘ధర్మయుగ్‌’లో  సబ్ ఎడిటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన రవివర్, ప్రభాత్ ఖబర్ వంటి ప్రచురణ సంస్థలలో పనిచేశారు.  తదుపరి కాలంలోప్రభాత్ ఖబర్‌కు చీఫ్ ఎడిటర్ అయ్యారు. హరివంశ్.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగా కొంతకాలం పనిచేసిన ఆయన ఆ ప్రభుత్వం పతనమైన  అనంతరం తిరిగి జర్నలిజం వైపు మళ్లారు. 

దన్‌ఖడ్‌ రాజీనామా..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఎవ్వరూ ఊహించని రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన విపక్ష పార్టీలు మొదలు సర్వోన్నత న్యాయస్థానం వరకు దాదాపు అందరిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్ ఆకస్మిక నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు రాజీనామాచేశారన్న చర్చ మొదలైంది. అయితే తాను ఆనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవిని వీడుతున్నట్లు ఆయన సోమవారం సాయంత్రం పేర్కొన్నా రు. 

ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్ ఖడ్

ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా పంపించారు. 'నా ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిం చాలనుకుంటున్నా. ఈ మేరకు వైద్యులు సూచించిన సలహాలను పాటించేందుకు అనువుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నా. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణం ప్రకారం ఉపరాష్ట్ర పతిగా నేను తీసుకున్న నా రాజీనామా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఉపరాష్ట్రపతిగా పదవీబాధ్యతలు నెరవేర్చిన కాలంలో నాకు పూర్తి మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయ తలు ఎప్పటికీ మరువలేను. 

ఉపరాష్ట్రపతిగా ఇన్నాళ్లూ ఎన్నో విలు వైన విషయాలు నేర్చుకున్నాను. అనేక జీవితానుభవాలను మూట గట్టుకున్నా. ఇంతటి పరివర్తనాత్మక సమయంలో ఉపరాష్ట్రపతిగా దేశ ఆర్థిక పురోభివృద్ధి, దేశాభివృద్ధిని గమనించా. ఈ అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకెంతో సంతృప్తినిచ్చిం ది."అని థన్కడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 74 ఏళ్ల ధనఖడ్ ఉపరాష్ట్రపతిగా 2022 ఆగస్ట్లో బాధ్యతలు చేపట్టారు. ఈయన వాస్తవానికి మరోరెండేళ్లు పదవిలో కొనసాగాల్సి ఉంది. అనారోగ్యంతో ఇటీవల ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ మార్చిలోఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్న విషయం విదితమే. అందరికీ ఎదురెళ్లి.. విపక్షాలపై అధికార పక్షంకంటే దీటుగా విమర్శలు సంధించారన్న పేరును ధనడ్ మూటగట్టుకున్నారు. 

స్వతంత్రభారతంలో తొలి సారిగా ఉపరాష్ట్రపతిని అభిశంసించాలన్న డిమాండ్ ఈయన పైనే రావడం యాధృచ్ఛికం అసలేకాదు. విపక్షాలు అభిశంసన కోసం ప్రయత్నించగా రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆ ప్రయత్నా న్ని అడ్డుకున్న విషయంతెల్సిందే. పదవిలో ఉండగానే రాజీనామా చేసిన మూడో ఉపరాష్ట్రపతిగా ధనడ్ రికార్డలకెక్కారు. గతంలో వీవీ గిరి, ఆర్.వెంకటరామన్ ఇలాగే రాజీనామాలు సమర్పించారు. వాళ్లిద్దరూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకోసం రాజీనామాచేయగా ధన్యడ్ ఆనారోగ్యం వల్ల రాజీనామా చేయడం గమనార్హం. ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనేదానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజ్యసభ డెప్యూటీ చైర్మన్గా అపార అనుభవం గడించిన హరివంశ్ను ఉపరాష్ట్రపతి పదవి రేసు ముందంజలో ఉండొచ్చని
బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 

రైతు బిడ్డ నుంచి ఉపరాష్ట్రపతి దాకా.. రాజస్తాన్లోని ఝుంఝును జిల్లాలోని కథానా గ్రామంలో 1951 మే 18వ తేదీన రైతు కుటుంబంలో ధన్బడ్ జన్మించారు. గతంలో జనతాదళ్ తర్వాత కాంగ్రెస్తో సత్సంబంధాలు కొనసాగించారు. 2008లో బీజేపీలో చేరారు. ఎల్ఎల్బీ కోర్సు తర్వాత 1979 నవం బరులో రాజస్థాన్ బార్ అసోసియేషన్ న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే 2019లో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఈయన పేరు ఎన్డీఏ సర్కార్ నామినేట్ చేశాక ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. మమతా బెనర్జీ సారథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ సర్కార్పై నిత్యం విమర్శలు చేస్తూ రాష్ట్రప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఈ విషయాన్ని మమతాబెనర్జీ పదేపదే ప్రస్తావిం చేవారు. విపక్షాలుసహా న్యాయవ్యవస్థలోని లోపాలను తరచూ ఎత్తిచూపేవారు. ధఝడ్ 1989లో జనతాదళ్ తరఫున ఝున్ ఝున్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 1990లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement