కరోనా ముప్పు తొలగలేదు

COVID-19 has not gone, is changing forms and resurfacing - Sakshi

రూపు మార్చుకుని మళ్లీ వస్తుంది

ప్రజలను హెచ్చరించిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ పూర్తిగా అంతరించిపోయిందని అనుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూపుమార్చుకుని మళ్లీ అది ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. మహమ్మారిపై జరిగే పోరాటంలో ఏమరుపాటు తగదని ప్రజలను ఆయన హెచ్చరించా రు. గుజరాత్‌లోని వంతలిలో ఉన్న ‘మా ఉమియా ధామ్‌’ఆలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఆదివారం వర్చువల్‌గా ప్రసంగించారు.

దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకు 185 కోట్ల టీకా డోసులు వేసినట్లు చెప్పారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సేద్యంతో భూమాతను కాపాడాలని ప్రధాని కోరారు. భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు, జల వనరులను కాపాడేందుకు జిల్లాకు 75 చొప్పున చెరు వులను తవ్వి, పరిరక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, అనీమియాతో బా ధపడే చిన్నారులు, మహిళల కోసం కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యంగా ఉం టేనే, సమాజం, దేశం బాగుంటాయని చెప్పారు.

బలమైన రైతులతో సుసంపన్న భారతం
రైతులు బలంగా ఉంటేనే నవీన భారతం మరింత సంపన్నవంతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దేశంలోని 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1.82 లక్షల ఓట్లను నేరుగా బదిలీ చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

ప్రికాషన్‌ డోస్‌ షురూ
న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు కరోనా ప్రికాషన్‌ డోస్‌ టీకా పంపిణీ ఆదివారం దేశవ్యాప్తంగా మొదలైంది. రెండో డోస్‌ తీసుకుని 9 నెలలైన వారంతా ప్రైవేట్‌ సెంటర్లలో ప్రికాషన్‌ డోస్‌ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. టీకా డోస్‌ ఖరీదుకు అదనంగా రూ.150 సేవా రుసుము కింద కేంద్రాలు తీసుకుంటాయని తెలిపింది. మొదటి రెండు డోసుల్లో వేసిన టీకానే ప్రికాషన్‌ డోస్‌గా ఇస్తారని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తెలిపింది. అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టతనిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top