Maharashtra: కరోనా మృతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం! 

Corona Updates: Maharashtra in Top Of Covid Deaths - Sakshi

ముంబై: కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య శాఖలు వేర్వేరు సంఖ్య వెల్లడించడంతో అయోమయ పరిస్ధితి నెలకొంది. దీంతో అసలు మృతుల సంఖ్య ఎంత.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక శాఖ 1,39,007 మంది అని వెల్లడించగా మరోశాఖ 1,48,404 అని పేర్కొంది. కరోనా మృతుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది.

ఆ తరువాత స్ధానంలో కేరళ రాష్ట్రం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మూడు దశల్లో వచ్చిన కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ఏకంగా 1,39,007 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో అధిక శాతం కుటుంబ పెద్ద దిక్కు, కుటుంబంకోసం సంపాదించే వారే ఉన్నారు. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  దేశంలో 2020 మార్చిలో కరోనా వైరస్‌ విజృంభించడం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలుచేసింది.

2020 మార్చి నుంచి 2021 అక్టోబర్‌ వరకు రాష్ట్రంలో 1,39,007 మంది కరోనా కారణంగా మృతి చెందారని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 92,212 మంది పురుషులు, మిగతా మహిళలు, పిల్లలున్నారు. కాని సార్వజనిక ఆరోగ్య విభాగానికి చెందిన సిబ్బంది ఈ నెలలో నిర్వహించిన తాజా అ ధ్యయనంలో 1,48,404 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ రా ష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది.  

కరోనా కారణంగా మృతి చెందిన వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అందులో కుటుంబ పెద్ద దిక్కు, సంపాధించే వారే అధికంగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోయినవారున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 851 మంది పిల్లలు అనాధలయ్యారు. అప్పట్లో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పొయి ఇలా అనాధలైన పిల్లలకు సాయం చేసింది. ప్రత్యేక పథకం ద్వారా ఆనాథ పిల్లల పేరట రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసింది. వీటి ద్వారా ఈ పిల్లలకు ప్రతీ నెల రూ.1,225 సాయం అందుతుంది. అంతేగాకుండా పీఎం కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం ద్వారా అనాథలైన ఈ పిల్లలకు 23 ఏళ్ల వయసొచ్చే సరికి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి.  

రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబై అగ్రస్ధానం... 
ఆరోగ్య శాఖ అందించిన గణాంకాల ప్రకారం కరోనా మృతుల్లో రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలతో పోలిస్తే ముంబై ప్రథమ స్ధానంలో ఉంది. రా్ర‹Ù్టరంలో కరోనా రోగుల సంఖ్య 81,35,620 ఉండగా అందులో ఒక్క ముంబైలోనే 11,53,951 ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా రోగులు 98.17 శాతం కోలుకోగా, మృత్యు రేషియో 1.82 ఉందని ఆరోగ్య శాఖ గుణంకాలు చెబుతున్నాయి.  

‘టీకా’ చట్టపరమైన బాధ్యత కాదు...
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ప్రోత్సహిస్తుందని, అయితే టీకాలు వేయడం ప్రభుత్వాల చట్టపరమైన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. వ్యాక్సిన్‌ వల్ల ఎవరైనా దుష్ప్రభావాలకు లోనైతే ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు మార్చి 22న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి తమ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తులు ప్రజా సౌకర్యాలను ఉపయోగించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం తరపున ఏఏజీ అమిత్‌ ఆనంద్‌ తివారీ, దీని వెనుక గొప్ప ప్రజా ప్రయోజనం ఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి కరోనా వ్యాక్సిన్‌ తప్పనిసరి, తద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్‌ మరింత విస్తరించబోదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఆయన ఉదహరించారు, ఇందులో రాష్ట్రాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పొందాలని కోరాయి. కరోనా వ్యాక్సినేషన్‌ మ్యుటేషన్‌ను నివారిస్తుందని, వ్యాక్సిన్‌ లేని వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

వ్యాక్సిన్‌ తయారీదారులు, ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సమ్మతి ఇచ్చిన వ్యక్తికి పూర్తిగా సమాచారం ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తదు. పరిహారం కోసం పిటిషనర్లు సివిల్‌ కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 2న విచారణ సందర్భంగా, ప్రభుత్వ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధానాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది, ఇది శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉందని, అయితే ఎవరినీ బలవంతంగా టీకాలు వేయించుకోలేమని పేర్కొంది. కానీ ప్రభుత్వ నిబంధనలు అయితే ప్రయాణానికి టీకాలు వేయడం తప్పనిసరి చేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top