ముస్లిం సంఘాలకు సీఎం హిమంత కృతజ్ఞతలు | CM Himanta Biswa Sarma thanks Muslim groups for deciding against cow sacrifice on Bakri Eid | Sakshi
Sakshi News home page

ముస్లిం సంఘాలకు సీఎం హిమంత కృతజ్ఞతలు

May 26 2026 4:57 PM | Updated on May 26 2026 5:08 PM

CM Himanta Biswa Sarma thanks Muslim groups for deciding against cow sacrifice on Bakri Eid

డిస్పూర్‌: ఇస్లాం మత ఆచారం ప్రకారం బక్రీద్ రోజున ప్రత్యేక నమాజ్ అనంతరం జంతువులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వారం జరగనున్న బక్రీద్‌లో గోమాతను బలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

అస్సాం అసెంబ్లీలో హిమంత మాట్లాడుతూ.. ‘ఈసారి అస్సాంలోని అనేక ముస్లిం సంఘాలు హిందువుల భావాలను గౌరవిస్తూ గోవు బలి చేయకూడదని నిర్ణయించాయి’ అని అన్నారు. హోజాయ్, ధుబ్రి, బోంగాయిగావ్, ఉదర్బోండ్ ప్రాంతాల్లోని ఇద్‌గాహ్, కబ్రిస్తాన్ కమిటీలు అధికారిక ప్రకటనలు జారీ చేసి, బక్రీద్ సందర్భంగా గోవు బలి చేయకూడదని విజ్ఞప్తి చేశాయి. ధుబ్రి టౌన్ ఇద్‌గాహ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో, బక్రీద్ రోజున గోవు బలి చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది.

కమిటీలు పేర్కొన్నది ఏమిటంటే, ఇస్లాంలో గోవు బలి తప్పనిసరి కాదు. హలాల్ జంతువులలో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా బలిదానం చేయవచ్చని ఇస్లామిక్ న్యాయశాస్త్రం చెబుతోంది. అందువల్ల గోవు బలి చేయకపోవడం మతపరమైన ఆచారానికి విరుద్ధం కాదని వారు వివరించారు. హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ‘సామాజిక-మతపరమైన ఐక్యతను బలపరిచే గొప్ప అడుగు’గా అభివర్ణించారు. ఇంకా నిర్ణయం తీసుకోని సంఘాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement