వాహనదారులకు అలర్ట్‌.. నేటి నుంచే కొత్త రూల్‌ | Cash Payments At Toll Plazas To Stop From April 10 | Sakshi
Sakshi News home page

వాహనదారులకు అలర్ట్‌.. నేటి నుంచే కొత్త రూల్‌

Apr 10 2026 7:05 AM | Updated on Apr 10 2026 9:14 AM

Cash Payments At Toll Plazas To Stop From April 10

ఢిల్లీ: టోల్‌ ప్లాజాల్లో నగదు చెల్లింపులు ఇవాళ నుంచి(ఏప్రిల్‌ 10, శుక్రవారం) బంద్‌ కానున్నాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాలకు 1.25 రెట్ల అధిక రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది. కేవలం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులను పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్‌ను అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్‌ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్‌ చార్జీని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది.

ఫాస్టాగ్‌ విధానంలో మాత్రమే టోల్‌ప్లాజా గేట్ల వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, అందుకే ఫాస్టాగ్‌ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వశాఖ చెబుతోంది. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్‌లతో వచ్చే వాహనాల టోల్‌చార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఫాస్టాగ్‌ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని  మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement