విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్‌ స్టాప్‌గా ప్రయాణించిన విమానం | Sakshi
Sakshi News home page

విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్‌ స్టాప్‌గా ప్రయాణించిన విమానం

Published Mon, Oct 3 2022 3:45 PM

Bomb Scare On Iranian Passenger Flight IAf Scramble Fighter Jets - Sakshi

ఇరాన్‌ విమానం భారత్‌ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్‌ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్‌ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్‌కి  జైపూర్‌ లేదా చండీగఢ్‌లలో ల్యాండ్‌ అయ్యేలా రెండు ఆప్షన్‌లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఐతే పైలెట్‌ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్‌ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్‌ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌ రంగంలోకి దిగి పైలెట్‌ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్‌ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది.

ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్‌ ట్రాకింగ్‌ వైబ్‌సైట్‌ ఫ్లైట్‌ రాడార్‌ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్‌ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై  మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది.

అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ తెలియజేసినట్లు సమాచారం.

(చదవండి: ప్రచండ్‌ హెలికాఫ్టర్‌.. ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’)

Advertisement
Advertisement