యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌.. అఖిలేష్‌ వ్యాఖ్యలతో పొలిటికల్‌ హీట్‌!

BJP Keshav Prasad Maurya Slams Akhilesh Yadav On UP CM Offer - Sakshi

ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సీటుకే ఎసరు పెట్టారు. దీంతో, యూపీ పాలిటిక్స్‌ చర్చనీయాంశంగా మారాయి. 

వివరాల ప్రకారం.. ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్‌ యాదవ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రచారంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో వారికి అఖిలేష్‌ యాదవ్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి అని కామెంట్స్‌ చేశారు. దీంతో, యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. 

ఇక, అఖిలేష​ ఆఫర్‌పై డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పందించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆఫర్‌ను నేను తిరస్కరిస్తున్నాను. అఖిలేష్‌ యాదవ్‌ ఎప్పటికీ సీఎం కాలేదు. అఖిలేష్‌ ముందుగా.. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాజ్‌వాదీ పార్టీలో గూండాలు ఉన్నందున వారిని మా పార్టీలోకి తీసుకోవడం లేదు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, రాంపూర్‌ ఉప ఎన్నికలకు డిసెంబర్‌ 5వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 8వ తేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top