ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం | Bilaspur train accident | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం

Nov 4 2025 5:08 PM | Updated on Nov 4 2025 7:37 PM

Bilaspur train accident

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాం నగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో బిలాస్‌పూర్ వెళ్లే మార్గంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆగిఉన్న గూడ్స్‌ ట్రైన్‌ను కోర్భా ప్యాసింజర్‌ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 10మంది ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సహాయ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. 

బిలాస్‌పూర్ స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లాల్‌ఖాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్యాసింజర్ రైలు హౌరాకు వెళ్తుండగా.. వ్యతిరేక దిశలో వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్ పైకి చొచ్చుకుపోయింది. ఒక కంపార్ట్‌మెంట్ పూర్తిగా దెబ్బతినగా.. గూడ్సు రైలు ఇంజన్‌కు భారీ నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రయాణికులు కోచ్‌లలో చిక్కుపోయారు. స్థానికులు, రైల్వే సిబ్బంది, పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాద వార్త వినిపించిన వెంటనే ఆగ్నేయా మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తరుణ్ ప్రకాష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు బిలాస్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) రాజ్మల్ ఖోయివాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసిన రైల్వే శాఖ ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెంబర్లకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. 

 రైల్వే ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ
రైల్వే ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో, రైలు ఒక నిర్దిష్ట పరిమితిలో వేగంతో నడుస్తుంది. ఈ వ్యవస్థతో మూడు రైళ్లు ఒకే ట్రాక్ పై వెళ్లవచ్చు. ప్యాసింజర్ రైలు గురించి డ్రైవర్ అధిక వేగంతో రైలును నడుపుతున్నాడని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, డ్రైవర్ రైలును అదుపు చేయలేకపోయాడు, అకస్మాత్తుగా గూడ్స్ రైలు ముందు ప్రమాదం జరిగింది. ఈ విధానం కింద రైళ్లు పగటిపూట గంటకు 15 కిలోమీటర్లు, రాత్రి సమయంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడపాల్సి ఉంటుంది.

హెల్ప్ లైన్ నంబర్:
చంపా జంక్షన్: 808595652
రాయ్గఢ్: 975248560
పెండ్రా రోడ్డు: 8294730162
ప్రమాద స్థలం: 9752485499, 8602007202
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement